Neem Leaves | చేదుగా ఉండే ఆహార పదార్థాలను తినేందుకు చాలా మంది అంతగా ఇష్టపడరు. కానీ చేదు అంటే వైద్య శాస్త్రం ప్రకారం ఔషధం. చేదుగా ఉండే ఆహారాలు మనకు ఔషధాలుగా పనిచేస్తాయి. అందుకనే చేదుగా ఉండే వేపాకులకు ఆయుర్వేదంలో ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. చేదుగా ఉండే కాకరకాయలనే తినలేరు, ఇక వేపాకులను ఎలా తింటారు.. అని సందేహించకండి. ఎందుకంటే వేపాకులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. అనేక రకాల వ్యాధులకు వేప దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వేపాకులను రోజూ ఉదయం పరగడుపునే నాలుగైదు తీసుకుని నేరుగా అలాగే నమిలి తినాలి. చేదుగా ఉన్నప్పటికీ తినడం అలవాటు చేసుకుంటే కొద్ది రోజులకు ఎలాంటి చేదు రుచిని మీరు ఫీల్ అవ్వరు. వేపాకులను రోజూ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా షుగర్ వస్తోంది. అయితే వేపాకులు డయాబెటిస్‌కు దివ్యౌషధంగా పనిచేస్తాయి. వేపాకులను రోజూ ఉదయం పరగడుపునే తింటుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. వేపాకులను తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు వేపాకులను తినాలి. ఎందుకంటే షుగర్ లెవల్స్ మరీ అధికంగా పడిపోతే ప్రమాదం కనుక డాక్టర్ సూచన మేరకు ఈ ఆకులను తినాల్సి ఉంటుంది.
వేపాకులను తినడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. వేపాకుల్లో శుద్ధి చేసే గుణాలు ఉంటాయి. ఇవి లివర్, కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి. దీంతో ఆయా భాగాల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. ఉదయం పరగడుపునే వేపాకులను తింటే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. రోగాలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. వేపాకుల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కనుక ఈ ఆకులను తింటుంటే పొట్టలో ఉండే నులి పురుగులు నశిస్తాయి. ముఖ్యంగా చిన్నారులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కనుక వారికి ఒకటి లేదా రెండు వేపాకులను తినిపిస్తుంటే ఫలితం ఉంటుంది.
వేపాకుల్లో ఫ్లేవనాయిడ్స్, టెర్పినాయిడ్స్, నింబిన్, నింబిడిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. వర్షాకాలం సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. దగ్గు, జలుబు నుంచి సైతం త్వరగా ఉపశమనం లభిస్తుంది. వేపాకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. వేపాకులను నేరుగా అలాగే తింటుండాలి. లేదా వీటిని పేస్ట్‌లా చేసి దాన్ని కట్టులా చేసి కడుతుండాలి. దీంతో శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. ఇలా వేపాకులతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.