Bomb Threats | జర్మనీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన లుఫ్తానా (Lufthansa ) ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపులు (Bomb Threats) వచ్చాయి. దీంతో సుమారు రెండు గంటల ప్రయాణం అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చింది.
బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్‌కు చెందిన విమానం ఆదివారం మధ్యాహ్నం 2:14 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టు ( Frankfurt Airport)నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉంది. విమానం బయల్దేరిన దాదాపు రెండు గంటల తర్వాత బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని వెనక్కి మళ్లించారు. అక్కడ అన్ని భద్రతా తనిఖీల అనంతరం విమానం సోమవారం ఉదయం తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Benjamin Netanyahu | ట్రంప్‌ను చంపాలని చూస్తున్న టెహ్రాన్.. ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
Israel Iran War | ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. జెరూసలెంలో సైరన్ మోతలు
భారత్, పాక్ వార్ తరహాలోనే.. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ఆపేస్తా: ట్రంప్