జెరూసలెం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను (Donald Trump) ఇరాన్ చంపాలని చూస్తున్నదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ టార్గెట్ ట్రంపేనని, ఆ దేశానికి ప్రథమ శత్రువు అమెరికా అధ్యక్షుడేనని చెప్పారు. అణు ఒప్పందాన్ని రద్దు చేసినందుకే ట్రంప్‌ను లేకుండా చేయాలని ఇరాన్ (Iran) భావిస్తున్నదని ఆరోపించారు. 2024లో రెండు సార్లు ఆయనను అంతమొందించడానికి ఇరాన్ ప్రయత్నించిందన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో నెతన్యాహూ మాట్లాడుతూ.. ట్రంప్‌ను చంపాలని ఇరాన్ చూస్తున్నది. ఆయనే ఇరాన్‌కు నంబర్‌వన్ శత్రువు. ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడు. బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరు. ప్రత్యర్థికి లొంగిపోరు. గతంలో జరిగిన నకిలీ అణుఒప్పందాన్ని రద్దుచేసి.. ఖాసిమ్ సులేమానీని మట్టుబెట్టారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదు. ఈ నేపథ్యంలో ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన శత్రువుగా మారారు. అందుకే ఆయనను చంపాలని చూస్తున్నదని చెప్పారు.
Netanyahu claims that Iran tried to assassinate Trump twice, strongly implying that Iran was behind the two assassination attempts in 2024 — with virtually no pushback from Bret Baier. He then goes on to thank Trump for the extensive US involvement in the current operation pic.twitter.com/savpcfxMMX
— Michael Tracey (@mtracey) June 15, 2025
ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఇరాన్ అణు కార్యక్రమాలు చేపడుతున్నదని నెతన్యాహూ అన్నారు. తమ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలావరకు వెనక్కి నెట్టాయని చెప్పారు. ప్రపంచ దేశాలన్నింటికీ ఇరాన్ పెనుముప్పుగా మారుతున్నదని వెల్లడించారు. అందుకే, దాడులు చేయడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ముప్పును సమూలంగా తొలగించేంతవరకు తమ పోరాటం ఆగదని, ఇజ్రాయెల్ తనను తానే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తున్నదని చెప్పారు.
కాగా, తమ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కజేమీ, ఆయన డిప్యూటీ జనరల్ హసన్ మహాకిక్ చనిపోయారని నెతన్యాహూ వెల్లడించారు. ఐఆర్జీసీ నిఘా విభాగానికి చెందిన మరో కీలక అధికారిని కూడా మట్టుబెట్టినట్లు తెలిపారు. ఐడీఎఫ్ వైమానిక దాడుల్లో ఇప్పటికే రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధిపతి కూడా మరణించిన విషయం తెలిసిందే.
Q: “Is regime change part of the effort here?”
NETANYAHU: “It could certainly be the result because the Iran regime is very weak.”
“Moments ago I can tell you we also got their chief intelligence officer and his deputy in Tehran.”
— Breaking911 (@Breaking911) June 15, 2025