OTT | మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో నటిస్తూ అలరిస్తుంది. తాజాగా ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించిన ఉప్పు కప్పురంబు చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తుండగా, ఈ చిత్రానికి అని. ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. ఇందులో కీర్తి సురేష్ తో పాటు సుహాస్, బాబు మోహన్, శత్రు మరియు తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది.
కీర్తి సురేష్, సుహాస్, బాబు మోహన్, శత్రు, మరియు తాళ్లూరి రామేశ్వరి వంటి అద్భుతమైన తారాగణం నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో డబ్‌లతో ప్రసారం చేయనున్నారు. చమత్కారం, హాస్యం తో నిండిన ఉప్పు కప్పురంబు ఒక సామాజిక సమస్యపై తేలికపాటి దృక్పథాన్ని ప్రదర్శిస్తుంది.1990 నాటి కథాంశంతో ‘ఉప్పుకప్పురంబు’ సినిమా రూపుదిద్దుకుంది. దక్షిణ భారతదేశంలోని లోతట్టు ప్రాంత మైన చిట్టి జయపురం అనే కల్పిత గ్రామంలో ఈ కథ సాగుతుంది. తెలుగులో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ డబ్ చేసి ప్రైమ్ వీడియలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
‘ఉప్పు కప్పురంబు’లో దర్శకుడు ఓ సామాజిక సమస్యను ప్రధానాంశంగా తీసుకొని తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. అయితే అందరూ మెచ్చే విధంగా, ఆమోదయోగ్యంగా దీనిని తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. ఉప్పు కప్పురంబు అనేది ఆలోచింపజేసే, ఆహ్లాదకరమైన, విచిత్రమైన వ్యంగ్య రూప చిత్రం. ఇది ప్రామాణికమైన గ్రామీణ వాతావరణ సారాన్ని తెలియజేస్తుంది. అదే సమయంలో ఒక అసాధారణమైన ఇతివృత్తాన్ని తెరపైకి తెస్తుంది. ఎల్లనార్ ఫిల్మ్స్‌తో కలిసి పనిచేయడం, కీర్తి సురేష్, సుహాస్ వంటి ప్రతిభావంతులైన తారాగణంతో ఈ సినిమాను నిర్మించడం ఆనందంగా ఉంది అని దర్వకుడు ఐ.వి. శశి చెప్పారు