Farmers Cultivation | రాయపోల్, జూన్ 09 : తొలకరి జల్లులు పడటంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. రైతులు వానకాలం పంటల సాగుపై దృష్టి సారించారు. ఈ సంవత్సరం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో మొత్తం పంట సాగు విస్తీర్ణం 18 వేల ఎకరాలు ఉండగా అందులో 10249 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసే అవకాశం ఉందని చేసే అధికారులు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 1045 ఎకరాల్లో వరి పంట సాగుతో పాటు 6500 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.
ఇప్పటికీ వ్యవసాయ దుక్కులను దున్నుకొని సిద్ధం చేసుకున్నారు. తొలకరి వర్షాలు కురుస్తున్నందున రాయపోల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతాంగం వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. చాలా గ్రామాల్లో ఇప్పటికే ముందస్తుగా పత్తి విత్తనాలను వేశారు.
వర్షాలు బాగా కురిస్తే వరినాట్లు వేయడంతోపాటు మొక్కజొన్న. ఇతర పంటలు వేయడానికి దుక్కులు సాగు చేసుకుంటున్నారు. బోరుబోవుల వద్ద నాట్లు వేయడానికి రైతులు ముందుకు రాగా.. బోరు బావులు లేని రైతులు మొక్కజొన్న, పత్తి పంట సాగు చేసేందుకు దృష్టి సారించారు. కాగా గత మూడు రోజుల నుంచి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు దుక్కులు దున్ని పత్తి విత్తనాలు వేస్తున్నారు. ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండుతాయని రైతులు భావించి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి..
వానాకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఫర్టిలైజర్ వ్యాపారులపై నిఘా ఉంచి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా అధికారులు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. యాసంగి సాగులో రైతులు వరి సాగు చేయగా చాలా మంది రైతులకు దిగుబడి తక్కువగా వచ్చిందని దీనికి కారణాలు ఏమిటి అని రైతులు చర్చించుకుంటున్నారు. వానకాలం సాగు మొదలు కాగా అన్ని షాపుల్లో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఎరువులు అందుబాటులో ఉంచాలి..
వానాకాలం వ్యవసాయ పంటల సాగు కోసం వివిధ రకాల ఎరువులను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. యాసంగి సాగులో అనేక అవస్థలు పడ్డామని. వానాకాలం పంటల సాగు కోసం అన్ని రకాల ఎరువులను షాపుల్లో అందుబాటులో ఉంచే విధంగా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని రైతులు పేర్కొంటున్నారు. కోటి ఆశలతో వానకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. మండల వ్యాప్తంగా గ్రామాల్లో వ్యవసాయ పనులు మూడు రోజుల నుంచి ఊపందుకున్నాయి.

Dubai | దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి
Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్‌రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు