చెత్తకుప్పల్లో మెడిసిన్స్
జడ్చర్లలోని పాత సీహెచ్‌సీ ప్రభుత్వ దవాఖాన పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న సంఘటన మిరిచిపోకముందే మందులు చెత్తకుప్పలో పడేసిన ఘటన వెలుగుచూసింది. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రజలకు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగానూ కేసీఆర్ ప్రభుత్వంలో పట్టణంలో వంద పడకల ద వాఖాన నిర్మించారు.
- జడ్చర్ల పాత సీహెచ్‌సీ ఆవరణలో ప్రత్యక్షం
- రూ.లక్షల విలువైన మందులు మూలకు..
- వైద్యాధికారుల నిర్లక్ష్యంతోనే వృథాగా ఉన్నట్లు ఆరోపణలు
- ప్రజాధనం వృథా అంటూ స్థానికుల ఆగ్రహం
జడ్చర్ల టౌన్, జూలై 25 : జడ్చర్లలోని పాత సీహెచ్‌సీ ప్రభుత్వ దవాఖాన పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న సంఘటన మిరిచిపోకముందే మందులు చెత్తకుప్పలో పడేసిన ఘటన వెలుగుచూసింది. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రజలకు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగానూ కేసీఆర్ ప్రభుత్వంలో పట్టణంలో వంద పడకల ద వాఖాన నిర్మించారు. కల్వకుర్తి రహదారి పక్కన నిర్మించిన నూతన భ వనంలోకి 2023లో పాత సీహెచ్‌సీని షిఫ్ట్ చేశారు.
ఈ క్ర మంలో పాత సీహెచ్‌సీలో అందుబాటులో ఉన్న వైద్యపరికరాలతోపాటు మెడిసిన్స్‌ను కొత్త భవనంలోకి తరలించాల్సి ఉండగా.. వైద్యాధికారులు నిర్లక్ష్యంగా మెడిసిన్స్‌ను పాత దవాఖానాలోనే వదిలేశారు. 2023 నుంచి ఇప్పటి దాకా పాత భవనంలో ఉన్న మెడిసిన్స్‌పై వై ద్యాధికారులు దృష్టిసారించకపోవటంతో వృ థాగా మూలనపడ్డాయి. పేద రోగులకు ఉపయోగపడే మందులు పాత దవాఖాన ఆవరణలోని సంపు(చెత్తకుప్పలో) వెలుగుచూడ టం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొన్ని మెడిసిన్స్ 2025 వరకు ఎక్స్పైరీ గడువు ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగులకు అందకుండా పోయాయి.
ఎక్స్పైరీ గడువు దగ్గర పడిందని వదిలేశారో.. కొత్త దవాఖానకు కొ త్తగా మెడిసిన్స్ వస్తాయి.. మనకేందుకు ఈ మందులని వదిలేశారో? అర్థంకాని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం సరఫరా చేసిన మెడిసిన్స్‌ను ఇలా చెత్తకుప్పలో పడేసి రూ. లక్షలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చే శారన్న విమర్శలు ఉన్నాయి. 2022- 2023లో తయారైన మెడిసిన్స్ సైతం చెత్తకుప్పలో దర్శనమిస్తుండటం.. వైద్యాధికారులు చెబుతున్న మాటలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యాధికారులు నిర్లక్ష్యంగానే చెత్తకుప్పలో పాడేయడంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు తప్పించుకునే యత్నం
పాత సీహెచ్‌సీలో కుప్పలు కుప్పలు మెడిసిన్స్ మూలన పడిన విషయంపై అధికారులు మాత్రం కొవిడ్ సమయంలో వచ్చిన కిట్స్ అంటూ వైద్యాధికారులు తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. 2022, 2023వ సంవత్సరంలో తయారైన మెడిసిన్స్ సైతం చెత్తకుప్పలో దర్శనమిస్తుండటంతో వైద్యాధికారులు చెబుతున్న మాటాలకు అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. వైద్యాధికారులు నిర్లక్ష్యంగానే మెడిసిన్స్‌ను పాత సీహెచ్‌సీలో వదిలేశారని తెలుస్తోంది.
ఉన్నతాధికారుల తెలియజేయాలి
మెడిసిన్ ఎక్స్పైరీ అయితే వెంటనే సంబంధించిన మందుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాలి. వాటిని డిమాలిష్ చేసేందుకు గా నూ అనుమతులు తీసుకోవా లి. కానీ ఇక్కడ ఇవేమి పా టించకుండా పడేయటం పై వైద్యాధికారుల నిర్ల క్ష్యం ఇట్టే అర్థమవుతోంది.
కొవిడ్ సమయంలో వచ్చిన కిట్స్‌ను వదిలేశారు
‘నేను జడ్చర్ల ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టాను. పాత సీహెచ్‌సీలో మెడిసిన్స్ ఉన్నట్లు నా దృష్టికి వచ్చిం ది. దీనిపై విచారిస్తే కరోనా సమయంలో వచ్చిన మెడిసిన్ కిట్స్గా తెలిసింది. రోగులకు సరఫరా చేశాక కొన్ని మిగిలిపోయినట్లు తేలింది. వాటిలో చాలా వరకు ఎక్స్పైరీ కాగా పాత సీహెచ్‌సీలోనే ఉంచారు. వాస్తవానికి ఎక్స్పైరీ అయ్యాక ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసి తొలగించాల్సి ఉంటుంది. కానీ అప్పట్లో పనిచేసిన అధికారులు అలాంటిదేమి చేయకపోవటంతో వృథాగా పడి ఉన్నాయి.
– హర్షదుల్లా, సూపరింటెండెంట్, జడ్చర్ల దవాఖాన
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

