‘పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’
పోషక పదార్థాలతోనే తల్లి, పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ మాలతి, మున్సిపల్ కౌన్సిలర్ సత్యవతి అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు నాయుడుపేటలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ్ మహా వేడుకలు...
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 12 : పోషక పదార్థాలతోనే తల్లి, పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ మాలతి, మున్సిపల్ కౌన్సిలర్ సత్యవతి అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు నాయుడుపేటలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ్ మహా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన సూపర్వైజర్, కౌన్సిలర్లు టీచర్లు ఏర్పాటు చేసిన పోషక పదార్థాల ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జరిగిన అంగన్వాడీ లెవెల్ మానిటరింగ్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారానే సాధ్యపడుతుందన్నారు.
తాజా కూరగాయలు, కూరలు, గుడ్లు పప్పు దినుసులను తప్పనిసరి తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో అమలు జరుగుతున్న ఆరోగ్యలక్ష్మి పథకాన్ని గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు, కేంద్రాలలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిచే అందుతున్న వైద్య సేవలను సైతం పొందాలని వారు సూచించారు. చిన్నారులకు టీచర్లు సూచించిన విధంగా బాలమృతం ఇవ్వడంతో మంచి ఆరోగ్యం అందుతుందని, అంగన్వాడీ కేంద్రాలలో ఆంగ్ల బోధనతో పాటు, ఆరోగ్యం సుసాధ్యమన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఎన్ఎం అనురాధ, అంగన్వాడీ టీచర్లు పి.విజయలక్ష్మి, పి.సరోజిని, పి.సరితా బాయి, ఆశా కార్యకర్తలు పుల్లమ్మ, ఆర్పీలు వెంకటలక్ష్మి, స్వరూప, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

‘పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

