BRICS Summit | బ్రిక్స్ ఎవరికీ వ్యతిరేకం కాదన్న మోదీ.. 10 పాయింట్లతో రోడ్‌మ్యాప్ ప్రకటన
BRICS Summit : బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడారు.
BRICS Summit : బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడారు. బ్రిక్స్ సదస్సు ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బ్రిక్స్ కూటమి విషయంలో యూరప్ దేశాలకు ఉన్న సందేహాలపై మోదీ ఈ విధంగా సమాధానమిచ్చారు. గ్లోబల్ సౌత్ (దక్షిణ ప్రాంతపు దేశాలు) రూల్స్ రూపొందించే శక్తిగా ఎదగాలి.
ఐక్యరాజ్యసమితిలోనూ సవరణలు అవసరం. అన్ని దేశాలకు భాగస్వామ్యం కావాలి. అన్ని దేశాలు తమ గొంతుక వినిపించాలి. బ్రిక్స్‌ను బలోపేతం చేస్తూనే ప్రపంచస్థాయి సంస్కరణల కోసం ఒక మార్గాన్ని రూపొందించాలి. ప్రస్తుతం ఉన్న ప్రపంచ వ్యవస్థ ఒక పిరమిడ్‌లాగా ఉంది. అధికారం, బలం, ఆదిపత్యం, నిర్ణయాలు తీసుకునేవన్నీ పైన ఉండే దేశాలు. కింద ఉండే దేశాలు వీటివల్ల ప్రభావితం అవుతున్నాయి. అవి తమను తాము సొంతంగా నిర్మించుకోలేక పోతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తీసుకురావడాన్ని ఆలస్యం చేయకూడదు. ఈ విషయంలో చర్చలకు నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించుకోవాలి.
ఓటు హక్కు, నాయకత్వ స్థాయిలు, పాలసీలు రూపొందించడం వంటివన్నీ నేటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి అన్నారు. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో నౌకలపై దాడులు జరుగుతూ, సముద్రంపై నావికులకు కలుగుతున్న ఇబ్బందుల్ని మోదీ ప్రస్తావించారు. సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండాలని, నావికులను, సిబ్బందిని రక్షించుకునేందుకు అత్యవసర వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ వాణిజ్యానికి ఇది ఎంతో అవసరం అన్నారు. ఐరాసలో అనేక దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

