Akbaruddin Owaisi | కాంగ్రెస్ సర్కార్ ఖజానాలో పైసల్లేవ్ అంటూనే సామాన్య కాంట్రాక్టర్లను పట్టించుకోకుండా బడా కాంట్రాక్టర్లను వత్తాసు పలుకుతుందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు.
అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అండర్‌గ్రౌండ్ కేబులింగ్ కోసం రూ.1400 కోట్ల కాంట్రాక్ట్ ఒక్కటే కంపెనీకి తమను ఇచ్చారు. ఆ కంపెనీ చాలా లక్కీ కంపెనీ.. అన్ని కాంట్రాక్టులు ఆ కంపెనీకే దొరుకుతాయన్నారు. ఆ కంపెనీ బీజేపీకి కూడా డబ్బులు ఇస్తుంది.. అందుకే ఆ కంపెనీ పేరు చెప్పడం లేదన్నారు. ఆ కంపెనీ మాకైతే డబ్బులు ఇయ్యలేదు.. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, రైతుల కోసం, ప్రజల కోసం అయితే సర్కార్ ఖజానాలో డబ్బుల్లేవ్.. డబ్బులేవ్ అని అంటారు..
కానీ ఆ కాంట్రాక్టర్‌కు మాత్రం బరాబర్ బిల్లులు వస్తాయి.. కరెక్ట్ టైంకి డబ్బులు ఇస్తారని ఫైర్ అయ్యారు. ఆ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని బిల్లులు విడుదల చేశారో RTIలో అడిగినా ఇవ్వడం లేదు.. నేను కోర్టుకు వెళ్లాను. రూ.1400 కోట్ల కాంట్రాక్ట్ ఆ ఒక్క పెద్ద కంపెనీకే ఇచ్చే బదులు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వొచ్చు కదా.. వాళ్లు కూడా బతకాలి కదా అని అన్నారు.
హైదరాబాద్‌లో రూ.1400 కోట్ల అండర్‌గ్రౌండ్ కేబులింగ్ కాంట్రాక్ట్ ఒక్కటే కంపెనీకి ఇచ్చారు
ఆ కంపెనీ చాలా లక్కీ కంపెనీ.. అన్ని కాంట్రాక్టులు ఆ కంపెనీకే దొరుకుతాయి
ఆ కంపెనీ బీజేపీకి కూడా డబ్బులు ఇస్తుంది
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, రైతుల కోసం, ప్రజల కోసం అయితే ఖజానాలో డబ్బులు లేవని… https://t.co/MXMvDq8FtM pic.twitter.com/7ifL2TS48j
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026
Brahmotsavams | ఏపీ సీఎంకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత