MCA : భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), అజింక్యా రహానే(Ajinkya Rahane)లకు మరో గౌరవం దక్కనుంది. దిగ్గజ ఆటగాళ్లుగా కితాబులందుకున్న వీరి పేర్లను వాంఖడే స్టేడియంలోని లాంజ్(విశ్రాంతి గదులకు)లకు పెట్టాలని ముంబై క్రికెట్ సంఘం (MCA) నిర్ణయించింది. టీమిండియాకు, ముంబై క్రికెట్‌కు విశేష సేవలందించినందున విశ్రాంతి గదులకు సచిన్, రహానే పేర్లను ఎంసీఏ ఖరారు చేసింది. వీరితో పాటు దివంగత మాధవ్ మంత్రి(Madhav Mantri) పేరుతోనూ లాంజ్ ఉంటుందని శుక్రవారం ఎంసీఏ తెలిపింది.
ముంబై క్రికెట్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన వార్షిక సమావేశంలో మాజీ క్రికెటర్ల పేర్లను లాంజ్(విశ్రాంతి గదులకు)లకు పెట్టాలని ఎంసీకే తీర్మానించింది. దేశవాళీలో ముంబైకి ఆడిన సచిన్ టెండూల్కర్, ఇటీవలే వీడ్కోలు పలికిన అజింక్యా రహానే.. ముంబై రంజీ జట్టు మాజీ కెప్టెన్, దివంగత మాధవ్ మంత్రి పేర్లను వాంఖడే స్టేడియంలోని లాంజ్‌లకు పెట్టనుంది.
MCA Set To Name Lounges At Wankhede Stadium In Honour Of Sachin Tendulkar, Ajinkya Rahane#WankhedeStadium #SachinTendulkar #AjinkyaRahane https://t.co/fTqu1Z0TMx pic.twitter.com/7TKs7Ioirl
— NDTV Sports (@Sports_NDTV) September 12, 2026
సచిన్, రహానే, మాధవ్ పేర్లనే ఏ లాంజ్‌కు పెట్టాలి? వాటిని తీర్చిదిద్దేబాధ్యతను ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీకి, కార్యదర్శులకు అప్పగించామని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ వెల్లడించారు. ఎంసీఏ ఉపాధ్యక్షుడు జితేంద్ర అవ్హాద్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు మిలింద్ నర్వేకర్, సలహాదారుడు ఉజ్వల్ నికమ్ ఈ ముగ్గురు సభ్యుల కమిటీలో ఉన్నారు. వార్షిక సమావేశంలోనే అనుబంధ క్రికెట్ క్లబ్‌లకు రిజర్వ్ మొత్తంగా రూ.100 కోట్లు కేటాయించాలని ఎంసీఏ నిర్ణయించింది.