England Openers : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గెలుపు వాకిట నిలిచిన ఇంగ్లండ్(England)కు బిగ్ షాక్. 130 పరుగుల ఛేదనకు దిగిన ఆ జట్టు ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్లను కోల్పోయింది. పాకిస్థాన్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్(2-20) మొదటి, ఆఖరి బంతుల్లో బెన్ డకెట్(0), ఎమిలియో గే(0)ను ఔట్ చేశాడు. పాక్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ ఓపెనర్లు సున్నాకే ఔటవ్వడం ఇది మూడోసారి. మొదటిసారి 1973లో, అనంతరం 2005లో.. మళ్లీ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్లు సున్నాలు చుట్టేశారు.
మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్‌కు వైట్‌వాష్ తప్పేలా లేదు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్ల పోరాటం.. ఆపై మొహమ్మద్ అబ్బాస్(2-20) విజృంభణతో ఇంగ్లండ్‌కు సవాల్ విసరుతోంది. 130 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌కు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు అబ్బాస్.
WHAT A START TO DAY 4!
Mohammad Abbas removes both England openers for ducks in the first over of the innings 🤯 #ENGvPAK pic.twitter.com/HRdm3JYrDP
— Cricinfo (@cricinfo) September 12, 2026
నాలుగో రోజు తొలి సెషన్లో బంతి అందుకున్న అతడు.. మొదటి, ఆఖరి బంతుల్లోనే ఓపెనర్లను డకౌట్ చేయడం విశేషం. బెన్ డకెట్(0) క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. ఎమిలియో గే(0) ను ఎల్బీగా వెనక్కి పంపాడు అబ్బాస్. ప్రస్తుతం కెప్టెన్ జో రూట్(39 నాటౌట్), జోర్డాన్ కాక్స్(22 నాటౌట్) కీలక భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ను గెలుపు దిశగా నడిపిస్తున్నారు. 14 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి ఆతిథ్య జట్టు 64 పరుగులు చేసింది.
పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు ఇద్దరూ డకౌటవ్వడం ఇది మూడోసారి. తొలిసారిగా 1973లో హైదరాబాద్(సింధ్) వేదికగా జరిగిన మ్యాచ్‌లో మైక్ డెన్నెస్, డెన్సిస్ అమిస్లు సున్నాకే వెనుదిరిగారు. 2005 ఫైసలాబాద్ టెస్టులో మార్కస్ ట్రెస్కోథిక్, ఆండ్రూ స్ట్రాస్లు డకౌటయ్యారు. మళ్లీ 11 ఏళ్లకు.. బెన్ డకెట్, ఎమిలియో గేలు డకౌటయ్యారు.
Mohammad Abbas get 2 wickets in the first over of England 2nd innings sending back both the openers
👇Here is the first wicket of Ben Duckett#ENGVSPAK pic.twitter.com/TvptGSj2oL— Faizan (@FaizanB64765206) September 12, 2026