KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా (కె) గ్రామంలోదళితులు పెద్ద ఎత్తున డప్పుల మోతతో ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ ఫొటోలు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం, దళితుల హక్కుల కోసం పోరాడిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఈ సందర్భంగా గ్రామస్తులు ఉద్ఘాటించారు. కేసీఆర్ పాలనలోనే దళితులకు నిజమైన గౌరవం లభించిందన్నారు. ‘దళితబంధు’ ప్రవేశపెట్టి దళితులకు ఆయన నిజమైన ఆత్మబంధువుగా నిలిచారు. కానీ నేడు రేవంత్ రెడ్డి పాలనలో దళితులకు ఇస్తామన్న ‘అంబేద్కర్ అభయహస్తం’ (కుటుంబానికి రూ. 12 లక్షలు) హామీ కేవలం కాగితాలకే పరిమితమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన దళిత డిక్లరేషన్ మాటలకే పరిమితమైంది. దళితులను కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుకోవడం కాంగ్రెస్కు అలవాటుగా మారింది అని ముఖ్రా (కే) గ్రామస్థులు ఫైర్ అయ్యారు.
తెలంగాణలోని దళిత వర్గాలు ఎల్లప్పుడూ కేసీఆర్కు అండగా ఉంటాయని, తమ సంపూర్ణ మద్దతు ఆయనకేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, దళిత నాయకులు విఠల్, తిరుపతి, దత్తా, ప్రహ్లాద్, దిగంబర్, శంకర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
కేసీఆర్ గారికి అండగా దళిత దండు
ముఖ్రా (కె) గ్రామంలో కేసీఆర్ గారికి మద్దతుగా దళితులు పెద్ద ఎత్తున డప్పుల మోతతో ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ గారి చిత్రపటాలు చేతబూని నినాదాలు చేస్తూ, ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. “అణగారిన వర్గాల… pic.twitter.com/0qT6JH5uWn
— BRS Party (@BRSparty) September 12, 2026
Brahmotsavams | ఏపీ సీఎంకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత