Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో చెలరేగిపోతున్న ఇంగ్లండ్ కెప్టన్ జో రూట్(Joe Root) చరిత్ర సృష్టించాడు. ఇటీవల కాలంలో పరుగుల వరద పారిస్తున్న రూట్.. రికార్డు అర్ధశతకం సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన రూట్ భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ను దాటేశాడు. రెడ్ బాల్ క్రికెట్లో అత్యధిక అర్ధశతకాలు బాదిన ఆటగాడిగా అవతరించాడీ రన్ మెషీన్.
టెస్టు క్రికెట్లో జో రూట్ పరుగుల సునామీ కొనసాగిస్తున్నాడు. రికార్డు శతకాలతో విరుచుకుపడుతున్న అతడు.. ఈసారి అత్యధిక అర్ధ శతకాల రికార్డును పట్టేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో సున్నాకే ఓపెనర్లు ఔటైనా.. క్రీజునంటుకున్న రూట్ పాకిస్థాన్ బౌలర్లను విసిగిస్తూ హాఫ్ సెంచరీ కొట్టాడు. కెరీర్లో 69వ టెస్టు ఫిఫ్టీతో అతడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు ముందు 68 టెస్టు ఫిఫ్టతో సచిన్ సరసన నిలిచిన అతడు.. యాభై రన్స్‌తో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.
Joe Root tops the list for most fifties in Test cricket 👏 https://t.co/LKXtOe8Eqq pic.twitter.com/ElulZZFVrj
— Cricbuzz (@cricbuzz) September 12, 2026
1. జో రూట్ (ఇంగ్లండ్)- 69
2. సచిన్ టెండూల్కర్(భారత్)- 68
3. శివ్‌నారాయణ్ చందర్‌పాల్(వెస్టిండీస్) – 66
4. అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) – 63
5. రాహుల్ ద్రావిడ్(భారత్) – 63
6. రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా) – 62