Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్‌రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు
Ramchander Rao | తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనగిరి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ధాన్యం దిగుబడుల అంచనాలను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్రానికి సరైన ఇండెంట్ పంపలేకపోయిందని ఆరోపించారు.
Ramchander Rao : తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనగిరి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ధాన్యం దిగుబడుల అంచనాలను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్రానికి సరైన ఇండెంట్ పంపలేకపోయిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్రం నిర్వహించదని, రాష్ట్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రమే రీయింబర్స్మెంట్ ఇస్తుందని స్పష్టంచేశారు.
దేశవ్యాప్త ధాన్యం సేకరణలో దాదాపు 50 శాతం తెలంగాణ నుంచే జరిగినప్పటికీ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలను పక్కనబెట్టి, వాస్తవాలను దాచిపెడుతూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఇదే క్రమంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మూసి ప్రక్షాళన ప్రాజెక్టులు సీఎం రేవంత్ రెడ్డికి ‘ఏటీఎం’లుగా మారాయని రాంచందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తాము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కేవలం ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకే తమ అభ్యంతరమని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని, అలాగే కాళేశ్వరం అవినీతి అంశంలో కేసీఆర్‌ను కాపాడేందుకే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రాంచందర్ రావు ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

