Farmers | రాయపోల్, మే 18 : రాష్ట్రవ్యాప్తంగా చాలా రోజులుగా పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల్లో కొనే దిక్కు లేక రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని తెలిసిందే. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో రైతులు ఐకేపీ ద్వారా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చెట్టును రోడ్డుకు అడ్డంగా వేసి సోమవారం గజ్వేల్-రామాయంపేట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతన్నలు రోడ్డుపై బైఠాయించి సుమారు రెండు గంటల పాటు ధర్నా చేపట్టడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న రాయపోల్ ఎస్ఐ మానస, ఐకేపీ ఏపీఎం యాదగిరి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. వడ్ల తరలింపునకు అవసరమైన లారీలను వెంటనే ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో రైతులు ధర్నాను విరమించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Watch: గన్ గురిపెట్టి జ్యుయలరీ షాపులో దోపిడీకి యత్నం.. సిబ్బంది ఏం చేశారంటే?
Road accident | రోడ్డు పక్కన రాతి గోడను డీకొట్టిన కారు.. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం
జూలూరుపాడులో ఘనంగా ‘టూ కే రన్’