జూలూరుపాడులో ఘనంగా ‘టూ కే రన్’
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం మండల కేంద్రమైన జూలూరుపాడులో నిర్వహించిన టూ కే రన్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతమైంది. జూలూరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి...
జూలూరుపాడు, మే 18 : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం మండల కేంద్రమైన జూలూరుపాడులో నిర్వహించిన టూ కే రన్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతమైంది. జూలూరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగును ఎంపీడీఓతో కలిసి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ బాదావత్ రవి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభమైన ఈ రన్ బస్టాండ్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ఈ పరుగులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచులు స్థానిక యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహ పరిచారు.
వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం
ఈ సందర్భంగా ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎస్ఐ బాదావత్ రవి మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అది మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని తెలిపారు. టూ కే రన్ వంటి సమిష్టి కార్యక్రమాలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్య మెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయని వివరించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రన్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి తులసీరామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, మాజీ సర్పంచులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జూలూరుపాడులో ఘనంగా ‘టూ కే రన్’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

