ముంబై: ఒక జ్యుయలరీ షాపులోకి దొంగలు ప్రవేశించారు. గన్ గురిపెట్టి నగలు దోపిడీకి ప్రయత్నించారు. అయితే అక్కడున్న సిబ్బంది ఆ వ్యక్తులను తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. (Jewellery Shop Staff Fight Robbers) మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నాసిక్‌లోని హిరావాడి ప్రాంతంలో ఉన్న న్యూ సమృద్ధి జ్యువెలర్స్‌లోకి ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. సిబ్బందికి పిస్టల్ చూపించి నగలు దోచుకునేందుకు ప్రయత్నించారు. భయపడిన ఒక మహిళ టేబుల్ కింద దాక్కున్నది.
కాగా, ఆ షాపులో ఉన్న మిగతా ఇద్దరు సిబ్బంది ఆ వ్యక్తులను తీవ్రంగా ప్రతిఘటించారు. ఒక మహిళ, మరో వ్యక్తి కలిసి ఆ దొంగలను ఎదుర్కొన్నారు. వారిపై తిరగబడ్టారు. చివరకు ఆ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఘర్షణ సమయంలో సిబ్బంది వ్యక్తి తలపై పిస్టల్ పిడితో ఒక దొంగ కొట్టడంతో అతడు గాయపడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ జ్యుయలరీ షాపు వద్దకు చేరుకున్నారు. అందులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. గన్‌తో బెదిరించి దోపిడీకి యత్నించిన దుండగులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Armed robbers open fire during attempted jewelry shop robbery in Nashik pic.twitter.com/pm21MHWEUl
— contentkikamii (@contentkikamii) May 16, 2026