న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి శనివారం రాజీనామా ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే జంతర్ మంతర్ వద్ద ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది. గుంపును చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు స్వల్ప లాఠీ చార్జీ చేశారు.
ఆందోళనకారుల్లో కొందరు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడంతో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులకు తల భాగంలో గాయాలయ్యాయని, వారిని వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు.