Farmers | రాయపోల్, ఆగస్టు 12 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కోసం అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. పంటలకు సరిపడా యూరియా అందకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. ఆధార్ కార్డుకు రెండు బ్యాగులు ఇస్తుండటంతో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున మొక్కజొన్న, వరి పంటలకు యూరియా అవసరమవుతున్ననేపథ్యంలో యూరియా బస్తాల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద క్యూలైన్లు కడుతున్నారు. అయితే అవసరానికి సరిపడా యూరియా లేకపోవడంతో ఫర్టిలైజర్ దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ రెండు బ్యాగుల యూరియాను మాత్రమే ఇవ్వడంతో చాలీచాలని యూరియాతో రైతాంగం పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.
మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రానికి లారీ యూరియా వచ్చింది. అయితే పర్టిలైజర్ దుకాణం వద్ధ గంటల తరబడి పడిగాపులు కాస్తే కేవలం రెండు బ్యాగుల యూరియా అందించారని.. భూమి ఎక్కువ ఉన్నప్పటికీ రెండు బ్యాగుల యూరియా ఎలా సరిపోతుందని పలు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో రైతులకు అవసరమైనంత యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Dharmasthala: ధర్మస్థలిలో మృతదేహాల వెలికితీత.. డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో గుర్తింపు
RS Praveen Kumar | కోడి గుడ్ల కుంభకోణం రూ. 600 కోట్లు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Gunfire | చందానగర్‌లో దొంగల బీభత్సం.. ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులు