ధర్మస్థలి: దక్షిణ కన్నడలోని ధర్మస్థలి(Dharmasthala) సమీపంలో సామూహికంగా వందల సంఖ్యలో అమ్మాయిల మృతదేహాలను పాతిపెట్టినట్లు ఓ మాజీ శానిటేషన్ వర్కర్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ గత కొన్ని రో్జుల నుంచి తొవ్వకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఖనన ప్రదేశాలను వెలికితీస్తున్నారు. పాయింట్ నెంబర్ 13 వద్ద ఇవాళ గాలింపు చేపట్టారు. అయితే మృతదేహాలను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీ వాడుతున్నారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్‌తో బొందపెట్టిన కళేబరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ భధ్రత మధ్య అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ ఆపరేషన్ చేపడుతోంది.
ఇప్పటికే ఈ కేసులో పలు ప్రదేశాలను తొవ్వారు. అయితే తొలిసారి జీపీఆర్ టెక్నాలజీతో ఆ ప్రాంతాన్ని సెర్చ్ చేస్తున్నారు. సంప్రదాయ జీపీఆర్ డివైస్‌లకు బదులుగా.. కొత్తగా వచ్చిన అత్యాధునిక సిస్టమ్‌ను వాడుతున్నారు. డ్రోన్ కింద యాంటీనా ఈ పరికరాలకు ఉంటుంది. గ్రౌండ్‌కు సమీపంగా ఆ డ్రోన్ వెళ్తుంది. భూమిలోకి సిగ్నల్ పంపిస్తుంది. అయితే సెన్సార్ల ద్వారా వస్తున్న డేటాను రికార్డు చేస్తారు. రేడార్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో 2డీ, 3డీ ఇమేజింగ్ చేస్తారు. నదీ ప్రాంతంలో భూమిలోపల ఉన్న ఎటువంటి వస్తువునైనా ఈ టెక్నాలజీతో గుర్తిస్తారు.
పాయింట్ 13 ఇప్పుడు ఈ కేసులో కీలక ప్రదేశంగా మారింది. ఇక్కడ ఉన్న నేలతో పాటు సమీప ప్రాంతాలను కూడా జీపీఆర్ టెక్నాలజీతో గాలింపు చేపట్టనున్నారు. సిట్ అధికారులతో పాటు రెవన్యూ, పంచాయతీ సిబ్బంది ఈ ప్రాంతాన్ని క్లీన్ చేస్తున్నారు. సామూహిక ఖననం జరిగిన ప్రదేశం గురించి ఏదైనా సమాచారం దొరుకుతుందని భావిస్తున్నారు. సైట్ వద్ద సుమారు 50 మంది పోలీసుల్ని మోహరించారు. జీపీఆర్ డ్రోన్లతో చేపడుతున్న తనిఖీల వల్ల రాబోయే రోజుల్లో ఏదైనా కీలక సమాచారం వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
ధర్మస్థలి ప్రాంతంలో 1995 నుంచి 2014 మధ్య.. వందల సంఖ్యలో అమ్మాయిలు, మహిళలను రేప్ చేసి హత్య చేశారని, వారిని సామూహికంగా పాతిపెట్టనట్లు ఓ శానిటేషన్ వర్కర్ జూన్ 3వ తేదీన ఫిర్యాదు చేశాడు. ధర్మస్థల ఆలయ బోర్డులో ఆ శానిటేషన్ వర్కర్ జీతం తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అనేక మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు అక్కడ రిపోర్టు అయ్యాయి. ఈ నేపథ్యంలో శానిటేషన్ వర్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నేత్రావతి నదీ తీరం వెంట సామూహిక ఖనన ప్రదేశాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
🚨 Big developments in #Dharmasthala probe — #SIT deploys Ground Penetrating Radar at site no.13 near Netravati bathing ghat. High-tech investigation underway to uncover the truth beneath the surface. ⚠️🔍 #GPR #Investigation pic.twitter.com/nVCMgUksHo
— Citizen MattersX (@CitizenMattersX) August 12, 2025