హైదరాబాద్: చందానగర్‌లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఖజానా జ్యువెలరీ దుకాణంలో (Khazana Jewellers) దుండగులు దోపిడీకి యత్నించారు. సిబ్బంది ఎదురుతిరడంతో వారిపై కాల్పులు (Gunfire) జరిపారు. దీంతో ఓ వ్యక్తి గాయపడ్డారు.
మంగళవారం ఉదయం చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ దుకాణంలోకి చొరబడిన దొంగలు.. లాకర్ తాళంచెవి ఇవ్వాలని తుపాకీతో సిబ్బందిని బెదిరించారు. దీనికి సిబ్బంది నిరాకరించడంతో కాల్పులు జరిపారు. దీంతో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగ్గొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. భయాందోళనలకు గురైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల కోసం పది బృందాలను ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు దుండగులు పాల్గొన్నట్లు, రెండు రౌండ్ల ఫైరింగ్ జరిపినట్లు తెలుస్తున్నది. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. షాపు తెరచిన 5 నిమిషాల్లోనే దీపిడీకి దుండగులు యత్నించారు. జహీరాబాద్ వైపు దొంగలు పారిపోయినట్లు తెలుస్తున్నది. దీంతో జిల్లాల సరిహద్దులను పోలీసులు అలర్టు చేశారు. మొత్తం ఎంత మంది వచ్చారనే విషయమై స్థానికంగా ఉన్న ట్రాఫిక్ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇతర షోరూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు.
కాగా, ఘటనా స్థలాన్ని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి పరిశీలించారు. కాల్పుల ఘటనపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దుండగులను పట్టుకోవడానికి వెంటనే పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ – చందానగర్ ఖజానా జువెలర్స్‌లో గన్ ఫైర్
పట్టపగలే ఖజానా జువెలర్స్‌లో చొరబడిన ఆరుగురు దుండగులు
గన్‌తో బెదిరించి లాకర్ కీస్ అడిగిన గ్యాంగ్.. ఇవ్వకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ కాలుపై కాల్పులు
సీసీ కెమెరాలపై ఫైర్ చేసి, బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టిన దుండగులు… https://t.co/gszcvvSxDw pic.twitter.com/TVji4PwYrn
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2025