వేములవాడ, మార్చి 8: పాత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఓ యువకుడిని మహిళ హతమార్చింది. ఆదివారం వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన భూక్యా మోహన్, బైరి శారద కొంతకాలం స్నేహంగా ఉన్నారు. శారద భర్త శేఖర్‌తో కలిసి వేములవాడ అంజనీనగర్‌లో నివాసంఉంటూ ప్రైవేట్ దవాఖానలో నర్స్‌గా చేస్తున్నది.
పాత పరిచయాన్ని అడ్డం పెట్టుకొని మోహన్ శారదను డబ్బులు ఇవ్వకుంటే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఈ క్రమంలో ఈ నెల 4న వేములవాడలోని ఓ లాడ్జికి మోహన్ రాగానే.. నైలాన్ తాడుతో బంధువు రవీందర్, భర్త శేఖర్‌తో కలిసి శారత హత్య చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించా రు. హత్యకు ఉపయోగించిన ద్విచక్రవాహన ం, నైలాన్ తాడు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, ఎస్‌లు ప్రేమానంద ం, రామ్మోహన్‌గౌడ్, సిబ్బంది ఇమ్రాన్, స ల్మాన్, శ్రీనివాస్‌ను డీఎస్పీ అభినందించారు.