గోవిందరావుపేట, ఫిబ్రవరి 22 : షార్ట్‌సర్క్యూట్‌తో ఎంపీడీవో కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమైన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలకేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే… ఆదివారం మధ్యాహ్న సమయంలో కా ర్యాలయంలోని స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి.
సీనియర్ అసిస్టెంట్ ఎక్బాల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైరింజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో స్టోర్ రూమ్స్‌లోని ఫైల్స్ కాలిబూడిదయ్యాయి.