‘బొగ్గుల శ్రీనివాస్’ది సుపారీ హత్య
ఏపీ రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్‌ది సుపారీ హత్యగా పోలీసులు తేల్చారు. వివరాలను ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్(48) కొంతకాలంగా యూట్యూబర్‌గా పనిచేస్తూ హైదరాబాద్ లో ఉంటున్నాడు.
- వివరాలు వెల్లడించిన ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 22 : ఏపీ రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్‌ది సుపారీ హత్యగా పోలీసులు తేల్చారు. వివరాలను ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్(48) కొంతకాలంగా యూట్యూబర్‌గా పనిచేస్తూ హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఈ నెల 14న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పా లేరు జ లాశయంలో ఓ కారు పడగా.. అందులో శ్రీనివాస్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగింది?
బొగ్గుల శ్రీనివాస్ తన స్నేహితుడు మేకల వేణుమాధవ్‌తో కలిసి శ్రీనివాస్ పేరుమీద ఉన్న జీఎస్టీ లైసెన్స్‌తో ‘వేణుమాధవ్ మేకా ప్రాజెక్ట్స్’ అనే కంపెనీ పెట్టారు. 2022-25 మధ్య రూ.90 లక్షల ప్రాఫిట్ రాగా రూ.45 లక్షలను శ్రీనివాస్‌కు ఇవ్వా ల్సి ఉంది. రూ.15 లక్షలను శ్రీనివాస్‌కు ఇ చ్చిన వేణుమాధవ్.. మిగిలిన రూ.30 లక్షలను ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. శ్రీనివాస్‌ను హత్యకు వేణుమాధవ్ ప్లాన్ చేశాడు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటకు చెందిన పోకల కోటేశ్వరరావు, అబ్జుల్హఫీజ్, ఎండీ అజ్మత్అలీకి రూ.5 లక్షల సుపారీ ఇచ్చాడు. ప్లాన్‌లో భా గంగా ఈ నెల 13న వేణుమాధవ్, శ్రీనివాస్‌తో కలిసి నిందితులు హైదరాబాద్ నుంచి కారులో అదే రోజు రాత్రి విజయవాడకు బయల్దేరారు. నకిరేకల్ సమీపంలోకి వచ్చాక నిందితులు శ్రీనివాస్‌ను హత్య చేశారు. అదే కారులో 14న పాలేరు జలాశయంలోకి కారుతోపాటు శ్రీనివాస్ మృతదేహాన్ని తోసేసి వెళ్లిపోయారు. అదే రోజు పోలీసులు బయటకు తీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

