హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ) : యువత వ్యవసాయరంగంపై ఆసక్తి చూ పాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో మూ డ్రోజుల పాటు నిర్వహించిన రైతుబడి అగ్రిషో ఆ దివారం విజయవంతంగా ముగిసింది. ఈ కా ర్యక్రమానికి ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న రైతుబడి యూట్యూబర్ జూలకంటి రాజేందర్‌రెడ్డి కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
యువతకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు మరిన్ని యూట్యూబ్‌లు ముందుకు రావాలని ఆకాక్షించారు. సాగురంగంలో వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలు, యంత్రాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని రాజేందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు రామోజీ ఫిలిం సిటీ పరిసరాల్లో మరింత విస్తృస్థాయిలో ఈ అగ్రి షోను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.