Urea | తొగుట : రైతులు అరుగాలం కష్టించి పండించిన మొక్క జొన్న ధాన్యం కు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మొక్కజొన్న ధాన్యం కొనుగోలుకేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తొగుటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు యూరియా కొరత మూలంగా రైతుల ఉసురుపోసుకున్నారని, నేడు మొక్కజొన్న రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు.
యాసంగి బోనస్ ఇంతవరకు ఇవ్వలేదని..
మొక్కజొన్న ధాన్యంకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 2400 ఉండగా.. బహిరంగ మార్కెట్లో 1800 వందలకే అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రెండు రోజుల్లో మొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుంటే రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ హయాంలో ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా చూడటం జరిగిందన్నారు.. యాసంగిలో సన్నధాన్యంకు రూ.500 బోనస్ ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో నిరంతర విద్యుత్ రాగా.. నేడు కరెంట్ కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, సుతారి రమేష్, వేల్పుల స్వామి, మంగ నర్సింలు, పబ్బతి వెంకట్ రెడ్డి, గొడుగు ఐలయ్య, మాదాసు అరుణ్ కుమార్, ఎల్లం, నందారం నరేందర్ గౌడ్, బోయిని శ్రీనివాస్, తగరం అశోక్, మధుసూదన్ రెడ్డి, ప్రకాష్,బైరారెడ్డి, లక్ష్మణ్ గౌడ్, కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.
Devarakonda Rural : 18న నిర్వహించే బీసీ బంద్‌ను జయప్రదం చేయాలి : సతీశ్ గౌడ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.