Auto Stand | పటాన్ చెరు, అక్టోబర్ 16 : 65వ జాతీయ రహదారి విస్తరణలో మట్టి కుప్పలను రోడ్డు పక్కన వేయడంతో ఆటో స్టాండ్ పూర్తిగా కనిపించక ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. గురువారం ఉదయం పటాన్ చెరు పట్టణంలో ఉన్న ఆటో స్టాండ్ వద్ద సమస్యను పరిశీలించి తన సొంత డబ్బులతో మట్టి పోసి ఆటో స్టాండ్ ఏర్పాటు చేశారు.
సమస్యను ఆటో యూనియన్ వారు కార్పొరేటర్ కు తెలుపగా సొంత నిధులతో జేసీబీ యంత్రంతో మట్టిని తొలగించారు. సమస్యను తెలిపిన వెంటనే స్పందించి పరిష్కరించినందుకు కృషి చేసిన కార్పొరేటర్ కు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. 65వ జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఫ్రీడమ్ పార్క్ పక్కన గల స్వయంకృషి ఆటో యూనియన్ స్టాండ్ వద్ద భారీ ఎత్తున మట్టి కుప్పలను వేయడంతో ఆటో స్టాండ్ కనిపించకుండా పోవడంతో, ప్రయాణికులు ఆటోలు ఎక్కడం లేదని స్వయంకృషి ఆటో యూనియన్ సభ్యులు పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమారి యాదవ్‌ను కలిసి వారి సమస్యను విన్నవించడం జరిగింది.
ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని..
సమస్యను విని వెంటనే స్పందించిన కార్పొరేటర్ సొంత నిధులతో జేసీబీ యంత్రాలతో, భారీ ఎత్తుగా వేసిన మట్టి కుప్పలను సమతలంగా చేయించడం జరిగింది. ఉచిత బస్సుల వల్ల ఆటో డ్రైవర్లు గిరాకీ లేక ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, అందులో అదనంగా జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలను భారీ ఎత్తుగా వేయడంతో ఫ్రీడమ్ పార్క్ పక్కనగల స్వయంకృషి ఆటో స్టాండ్ పూర్తిగా కనిపించక ప్రజలు ఆటోలు ఎక్కకపోవడంతో, ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని అన్నారు.
ఆటోని నమ్ముకుని జీవిస్తున్న వారు ఈ సమస్యల వల్ల ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆటో స్టాండ్ కు అడ్డుగా ఉన్న మట్టి కుప్పలను జేసీబీ యంత్రాలతో సమతలంగా చేసి, ఆటో స్టాండ్ కనిపించేలా చేయడం జరిగిందని కార్పొరేటర్ తెలియజేశారు.
తమ సమస్యను వివరించిన వెంటనే తక్షణమే స్పందించి సొంత నిధులతో జేసీబీ యంత్రాలను పురమాయించి, సమస్యను తొలగింపజేసినందుకు స్వయంకృషి ఆటో యూనియన్ సభ్యులంతా కార్పొరేటర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయంకృషి ఆటో యూనియన్ అధ్యక్షుడు నర్సింగ్ రావు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Read Also :
OG | థియేటర్లలో ‘ఓజీ’ ఘన విజయం ..ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై స్పెషల్ ఫోకస్..!
Ed Sheeran | ఇంటర్నేషనల్ కోలాబరేషన్.. బ్రిటీష్ పాప్ సింగర్‌తో సంతోష్ నారాయణన్ ఇండియన్ ఆల్బమ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.