OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ (OG)’ సినిమా థియేటర్లలో అంచనాలను అందుకుని మంచి మాస్ ఎంటర్టైనర్గా నిలిచింది. పవన్ స్టైలిష్ యాక్షన్, సుజీత్ డైరెక్షన్, అద్భుతమైన టెక్నికల్ వర్క్ కారణంగా సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం సినిమా బాక్సాఫీస్ రన్ ముగిసే దశలో ఉండగా, ఇప్పుడు అందరి దృష్టి దీని ఓటీటీ రిలీజ్‌పై పడింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా వీక్‌డేస్‌లో కొంత డ్రాప్ చూపించినా, ఓవరాల్‌గా సుమారు ₹290 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో మాస్ హిట్‌గా నిలిచింది. కథలో కంటెంట్ అంతగా లేదన్న విమర్శలు ఉన్నా, పవన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఫ్యాన్స్ ఎలివేషన్ సీన్లు సినిమాకు ఊపిరి పోశాయి.
థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే, ఈ సినిమా ₹4 కోట్ల వరకు ప్రాఫిట్ అందుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. నిర్మాత డీవీవీ దానయ్యకు నాన్ థియేట్రికల్ బిజినెస్ (ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ హక్కులు) ద్వారా మంచి లాభాలు వచ్చాయి. ‘ఓజీ’ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అందరిలోనూ ఒక్క ప్రశ్న.. అదేంటంటే థియేటర్లో మాస్ హిస్టీరియాగా మారిన ఈ సినిమా, ఓటీటీలో కూడా అదే స్థాయి రియాక్షన్ తెచ్చుకుంటుందా అని? థియేటర్లో యాక్షన్, పవన్ ఎనర్జీ ప్రధాన ఆకర్షణలు కాగా, ఓటీటీలో మాత్రం కథలోని ఎమోషనల్ డెప్త్, క్యారెక్టర్ ఆర్క్స్ ప్రేక్షకులను ఎంతవరకు కట్టిపడేస్తాయనేది కీలకం అవుతుంది.
సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్ రిలీజ్ తర్వాత 4 నుండి 8 వారాల్లో ఓటీటీలోకి వస్తాయి. అదే లెక్కన ‘ఓజీ’ నవంబర్ రెండో వారంలో, అంటే దీపావళి పండుగ అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. నిర్మాత దానయ్య, థియేట్రికల్ రన్‌కి ఇబ్బంది కలగకుండా కనీసం నాలుగు వారాల గ్యాప్ ఇచ్చేలా నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ‘ఓజీ’ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అయినా, మళ్లీ సోషల్ మీడియాలో సినిమా గురించి పెద్ద చర్చ మొదలవడం ఖాయం. యాక్షన్ సీన్లు, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీక్వెన్స్‌లు మరోసారి హైలైట్ అవుతాయి. అలాగే ఈ ఓటీటీ వ్యూస్, బజ్ రాబోయే ‘OG’ ఫ్రాంచైజ్ ప్రాజెక్ట్‌లకు కూడా సహకారం అందించవచ్చు.మొత్తం మీద, థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన ‘ఓజీ’, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్ని మిలియన్ల వ్యూస్ రాబడుతుందో అని ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు.