దేవరకొండ రూరల్, అక్టోబర్ 16 : బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులకు నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బంద్‌లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీశ్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం దేవరకొండలోని ఐబి గెస్ట్ హౌస్‌లో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. బంద్‌కు విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తోటపల్లి మల్లేశ్, విద్యార్థి సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సురకారపు సత్యం గౌడ్, మండలాధ్యక్షుడు బొడ్డుపల్లి సత్యం, యూత్ అధ్యక్షుడు పోతురాజు ధనరాజ్ యాదవ్, కొండమల్లేపల్లి యూత్ మండలాధ్యోఉడు కలగోని రమేశ్ గౌడ్, కొప్పుల శివ, కుంభం సిద్ధూ, పచ్చిపాల మహేశ్ యాదవ్, గోపి గౌడ్, సతీష్ స్వామి, కుంభం శేఖర్, కొండల్, గొడుగు శివ యాదవ్, ఉప్పునుతల శివకృష్ణ యాదవ్, నేతల రాజు యాదవ్, శివ గౌడ్, అఖిల్ పాల్గొన్నారు.