farmer | చేగుంట, జనవరి 20 : వ్యవసాయ పొలం దగ్గర ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో రైతు ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రుక్మాపూర్ గ్రామానికి చెందిన మేకల కిష్టయ్య (55) తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ పొలంలో నాటు వేశాడు.
అయితే పొలం దగ్గరున్న బోరు డబ్బాలో విద్యుత్ సరఫరా కాకపోవడంతో.. వేసిన వరి నాటు ఎండిపోయే అవకాశం ఉందని బోరు డబ్బాకు సరఫరా అయ్యే పొలం గట్టుపై ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్‌ను పరిశీలించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కిష్టయ్యకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో పొలంలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు వేణు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఇట్టి విషయమై స్థానికులు, కుటుంబ సభ్యులు చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Salaar 2 | ప్రభాస్ సలార్ 2 టీజర్ వచ్చేస్తుంది.. ఇంతకీ ఏ తేదీనో తెలుసా..?
Actor Srikanth | ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధిలో నటుడు శ్రీకాంత్.. వీడియో వైరల్