Actor Srikanth | ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ మంగళవారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వెలిసిన ప్రసిద్ధ శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయంలో జరిగే అత్యంత పవిత్రమైన ‘భస్మ హారతి’ సేవలో పాల్గొన్న ఆయన అనంతరం గర్భాలయంలోని జ్యోతిర్లింగానికి జలాభిషేకం, పంచామృత అభిషేకాలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకున్న శ్రీకాంత్, లోకకళ్యాణం కోసం మరియు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించినట్లు మీడియాకు తెలిపారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొనగా ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Madhya Pradesh | Actor Srikanth offered prayers at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/7xOquGwLbY
— ANI (@ANI) January 20, 2026