Salaar 2 | రీసెంట్గా మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్ష్తో స్క్రీనింగ్ అవుతోంది. ప్రభాస్ లైనప్‌లో క్రేజీ సినిమాలున్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి సలార్ ప్రాంఛైజీ.
కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ ప్రాంఛైజీలో రాబోతున్న సీక్వెల్ ప్రాజెక్ట్ సలార్ 2 (Salaar 2). సీక్వెల్‌ను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కాగా అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా మోస్ట్ ఎవెయిటెడ్ సీక్వెల్ సలార్ 2 టీజర్ కు టైం ఫిక్సయిందా…? అంటే నెట్టింట రౌండప్ చేస్తున్న తాజా కథనాలు అవుననే హింట్ ఇచ్చేస్తున్నాయి.
తాజా టాక్ ప్రకారం సలార్ 2టీజర్ జనవరి 25న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. ప్రస్తుతానికి ఇది అధికారిక వార్త ఏం కాకున్నా అభిమానులు మాత్రం ఈ అప్డేట్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సలార్ 2లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. శ్రియారెడ్డి, టిన్ను ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాలీవుడ్ యాక్టర్ షైన్ టామ్ చాకో కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు రౌండప్ చేస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్‌లో సలార్ 2 షూటింగ్ మొదలైందంటూ వార్తలు వచ్చాయి. 20 రోజులపాటు సాగే సలార్ 2 చిత్రీకరణలో ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్విరాజ్, ప్రభాస్ పాల్గొంటున్నారని ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ కూడా చేశాడు. ఈ లెక్కన టీజర్ వచ్చేది నిజమేనని అర్థమవుతున్నా మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
HE IS BACKKKKKKKK 🔥🔥
SALAAR 2 TEASER ON 25.01.2026 🤯
Salaar itself was potential ₹1000 Cr Grosser with a SOLO RELEASE 💥🥁#Prabhas | #Salaar2 | @SalaarTheSagapic.twitter.com/o5dquvwBiO
— Pan India Review (@PanIndiaReview) January 19, 2026
Mana Shankara Vara Prasad Garu | రూ. 300 కోట్ల క్లబ్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’.. వీడియో రిలీజ్
Actor Srikanth | ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధిలో నటుడు శ్రీకాంత్.. వీడియో వైరల్
Akshay Kumar | అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రమాదం