Do Deewane Seher Mein | బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘దో దీవానే షెహర్ మే’. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంకి రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తుండగా.. సంజయ్ లీలా భన్సాలీ, ప్రేరణ సింగ్, ఉమేష్ కుమార్ బన్సాల్, భరత్ కుమార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ చూస్తుంటే.. ముంబై నగరం నేపథ్యంలో జరిగే ఆధునిక ప్రేమ కథలా ఉంది. ఈ చిత్రంలో ఇలా అరుణ్, జాయ్ సేన్ గుప్తా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.