హరీశ్ రాకతో అంతా గప్‌చుప్
శనివారం ఉదయం... రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియోపోలిస్ లే అవుట్లో ఉన్న శారదాపీఠం వద్ద అలజడి మొదలైంది.
- అంతకుముందు రాజశ్యామల ఆలయ కూల్చివేతకు ప్రభుత్వం పక్కా స్కెచ్
- రంగంలోకి రెవెన్యూ, పోలీసు శాఖలు
- హరీశ్ ఎంట్రీతో బెడిసికొట్టిన వ్యూహం
- ఎట్ల కూలగొడుతరో చూస్తానంటూ భీష్మించుకు కూర్చున్న మాజీ మంత్రి
- చేసేదేమీ లేక అధికారులు వెనక్కి..
- ప్రజావ్యతిరేకతతో సర్కార్ యూటర్న్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): శనివారం ఉదయం… రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియోపోలిస్ లే అవుట్లో ఉన్న శారదాపీఠం వద్ద అలజడి మొదలైంది. రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి, గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డితో పాటు రెవెన్యూ యంత్రాంగం అక్కడికి చేరుకుంది. నా ర్సింగి ఏసీపీ రమణాగౌడ్, ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి, సహా దాదాపు 50 మందితో పోలీస్ యంత్రాంగం అక్కడ మోహరించింది. ఇక జేసీబీలు, ఇతర యం త్రాలు అక్కడికి తెప్పించేందుకు అంతా సిద్ధమైంది. మరి కొంత సమయమైతే అంతా నేలమట్టం..
రంగంలోకి మాజీ మంత్రి హరీశ్‌రావు
..కానీ అనూహ్యంగా మాజీ మంత్రి హరీశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు అవాక్కయ్యారు. వెంటనే అక్కడి నుంచి జారుకున్నారు. పోలీస్ బలగాలు రెండెకరాల చుట్టూ ఉన్న ప్రహరీ వెనక్కి వెళ్లిపోగా, పోలీస్, రెవెన్యూ అధికారులు కురుమ, ముదిరాజ్ సంఘాలకు కేటాయించిన భూముల వద్దకు వెళ్లిపోయారు. శారదా పీఠం ప్రాంగణంలో కలియదిరిగిన మాజీ మంత్రి హరీశ్‌రావు అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లేఅవుట్లోని ఇతర ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాల్పడుతున్న దుశ్చర్యను ఎండగట్టారు. హరీశ్రాకతో అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ప్రభుత్వం జలమండలి రిజర్వాయర్ నిర్మా ణం, ప్రజల తాగునీటి అవసరాలు అంటూ ఏదో ప్రకటన విడుదల చేసింది. పీఠం నిర్మించిన ఆలయా న్ని కూల్చివేసే దుస్సాహసాన్ని సమాజం ఎండగట్ట డం మొదలుపెట్టింది. దీంతో చేసేదేమీలేక చివరకు శనివారం సాయంత్రం రేవంత్‌రెడ్డి సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది.
క్యాబినెట్ భేటీ నుంచే మొదలైన ప్రణాళిక…
శారదా పీఠం రెండెకరాల కేటాయింపుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దృష్టిసారించినట్టుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటీవల జరిగిన మం త్రివర్గ సమావేశంలో ఓ ఎజెండా అంశంగా చేర్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పీఠానికి రెండెకరాల కేటాయింపుల్ని రద్దు చేసి.. ఆ భూమిని జలమండలికి కే టాయిస్తూ ఆమోదం తెలిపింది. అయినప్పటికీ ఈ విషయం పెద్దగా ప్రచారంలోకి రాలేదు. రెవెన్యూ అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోయారు. పీఠం వారికి మాత్రం అసలు ప్రభుత్వ పెద్దల్ని కలిసే అవకాశం కూడా ఇవ్వనట్టు తెలిసింది. అనూహ్యంగా మాజీ మంత్రి హరీశ్‌రావు రావడం తో అటు ప్రభుత్వం, ఇటు అధికార యంత్రాంగం ప్లాన్ ఒక్కసారిగా బెడిసికొట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

