Akshay Kumar | బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (Road Accident) గురైంది. ఆ సమయంలో కారులో అక్షయ్ కుమార్‌తోపాటూ ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా కూడా ఉన్నారు. అయితే, ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. అక్షయ్-ట్వింకిల్ ఖన్నా ఇటీవలే తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని విదేశాల్లో జరుపుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగిన వీరు తమ వాహనంలో ఇంటికి బయల్దేరగా.. మార్గం మధ్యలో వీరి వాహనం ప్రమాదానికి గురైంది. ముంబై (Mumbai) జుహు (Juhu)లోని ముక్తేశ్వర్ రోడ్ సమీపానికి వారు రాగానే వేగంగా వచ్చిన ఒక కారు ముందు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఆ వేగానికి ఆటో అదుపుతప్పి అక్షయ్ కుమార్ భద్రతా సిబ్బంది (Escort Vehicle) ప్రయాణిస్తున్న ఓ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో అక్షయ్ ప్రయాణిస్తున్న వాహనం, కాన్వాయ్‌లోని కారు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు నటుడి ఎస్కార్ట్ కారు బోల్తా కొట్టింది.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అక్షయ్ దంపతులతో పాటూఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఆటో మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యారు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్షయ్ కుమార్‌కు ఏమీ కాకపోవడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ముంబై పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read..
Road Accident | కారు ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృతి.. డ్రైవర్ అరెస్ట్
RN Ravi: మైక్‌ను స్విచాఫ్ చేసి అవమానించారు.. అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్
Sabarimala Gold Case: శబరిమల గోల్డ్ చోరీ కేసు.. 3 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు