కొచ్చి: శబరిమల అయ్యప్ప ఆలయంకు చెందిన బంగారం తాపడం కేసు(Sabarimala Gold Loss Case)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ మూడు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. ఆ ఘటనతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నది. కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 21 ప్రదేశాల్లో ఈడీ రెయిడ్స్ జరుగుతున్నాయి. పీఎంఎల్ఏ చట్టం పరిధిలో ఆ తనిఖీలు సాగుతున్నాయి. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి చెందిన బెంగుళూరు నివాసం, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ ఏ పద్మకుమార్ నివాసంలో ఈడీ సోదాలు చేస్తున్నది. కేరళ పోలీసు శాఖ ఎఫ్ఐఆర్ ఆధారంగా జనవరి 9వ తేదీన పీఎంఎల్ కేసును ఈడీ ఫైల్ చేసింది. చాలా సంచలనంగా మారిన బంగారం మిస్సింగ్ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతున్నది.