Road Accident | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. జబల్పూర్ (Jabalpur)లో జరిగిన కారు ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన బరేలా (Barela) ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రమాదం తర్వాత మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అదనపు సూపరింటెండెంట్ ఆప్ పోలీస్ సూర్యకాంత్ శర్మ తెలిపారు.
Also Read..
RN Ravi: మైక్‌ను స్విచాఫ్ చేసి అవమానించారు.. అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్
Sabarimala Gold Case: శబరిమల గోల్డ్ చోరీ కేసు.. 3 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
Ramachandra Rao: అసభ్య వీడియోలు వైరల్.. కర్నాటక పోలీసు అధికారి సస్పెన్షన్