Ramachandra Rao: అసభ్య వీడియోలు వైరల్.. కర్నాటక పోలీసు అధికారి సస్పెన్షన్
Ramachandra Rao: కర్నాటకలోని డీజీపీ స్థాయి పోలీసు అధికారి కే రామచంద్రరావుపై వేటు పడింది. అసభ్యకర వీడియోలు వైరల్ కావడంతో కర్నాటక సర్కారు ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
బెంగుళూరు: కర్నాటక పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి కే రామచంద్రరావు(Ramachandra Rao)పై వేటు పడింది. అసభ్యకరమైన వీడియోలు వైరల్ కావడంతో కర్నాటక సర్కారు ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. డీజీపీ స్థాయి ర్యాంక్ కలిగిన ఆ పోలీసు ఆఫీసర్ మహిళలతో తన ఛాంబర్‌లోనే రాసలీలలు ఆడాడు. ఆ ఘటనకు చెందిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కర్నాటక రాష్ట్రంలో ఆ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసుల తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ రామచంద్రరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రామచంద్రరావు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నట్లు ఉన్నదని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్నది. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్లో డీజీపీగా చేస్తున్న కే రామచంద్రరావును తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తన స్టేట్మెంట్లో తెలిపింది. అయితే సస్పెన్షన్ సమయంలో ఆయన హెడ్‌క్వార్టర్స్‌ను వీడి వెళ్లరాదు. రాష్ట్ర ప్రభుత్వ లిఖితపూర్వక అనుమతితోనే ఆయన బయటకు వెళ్లాల్సి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

