SI Manasa | రాయపోల్, మార్చి 25 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మానస సిబ్బందితో కలిసి రాయపోలు -గజ్వేల్ రోడ్డు పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేశారు. ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనాలను నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా బుధవారం గజ్వేల్ ADM court మెజిస్ట్రేట్ మణివీర్ ముందు హాజరు పరచగా 3 రోజులు జైలు శిక్ష విధించారు.
ఈ సందర్భంగా రాయపోల్ ఎస్ఐ మానస మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేయడానికి ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారికి ప్రమాదం, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమని అన్నారు.
ప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరచగా.. మెజిస్ట్రేట్ విచారణ జరిపి 10 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.
Talasani Srinivas Yadav | నగరంలో ఒక్క ఇంటినైనా నిర్మించారా ? అసెంబ్లీలో కాంగ్రెస్ను నిలదీసిన తలసాని
Fuel Shortage | తెలంగాణలో ఇంధన కొరత అవాస్తవం : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
Oka Roju | జపాన్ మంచులో సాయిపల్లవి ప్రేమకథ.. తెలుగులో ‘ఒక రోజు’గా ఏక్ దిన్!