Fuel Shortage | తెలంగాణలో ఇంధన కొరత అవాస్తవం : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
Fuel Shortage | తెలంగాణలో ఇంధన కొరత ఉందని తప్పుడు వార్తలు నమ్మొద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణలో ఇంధన కొరత ( Fuel Shortage ) ఉందని తప్పుడు వార్తలు నమ్మొద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ( Petroleum Dealers Association ) స్పష్టం చేశారు. అవాస్తవ ప్రచారాల వల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం హెచ్పీసీఎల్ ( HPCL) , ఐవోసీఎల్ ( IOCL ), బీపీసీఎల్ ( BPCL) వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపారు.
సరఫరా గొలుసు (Supply chain) ఎక్కడా ఆగలేదని, భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుంచి 3 రెట్లు విక్రయాలు పెరిగాయని వివరించారు. దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు. కానీ అది కొరత కాదని, పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం పీఈఎస్వో ( PESO ) నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
ఇటువంటి చర్యలు చాలా ప్రమాదకరమని, అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

