హైదరాబాద్, ఆగ స్టు 11(నమస్తే తెలంగాణ) : వచ్చి న నీటిని ఒడిసిపట్టకుండా గురువు చంద్రబాబుకు గు రుదక్షిణ చెల్లించేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి.. ఇప్పుడు వరుణయాగం పేరిట దేవునిపై భారమేయడమేమిటని ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు. ఇది రేవంత్‌రెడ్డి ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మంగళవారం ఒక ప్రకటనలో ధ్వ జమెత్తారు. ఎల్ నినోపై వాతావరణ సంస్థలు ముందే హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సమీక్ష కూడా నిర్వహించకపోవడం శోచనీయమని విమర్శించారు.
ఎలాంటి ప్రణాళికలు లేకపోవడమే కాకుండా, మేడిగడ్డలో చిన్న చిన్న మరమ్మతులు సైతం నిర్వహించకుండా ప్రాజెక్టును నిర్వీర్యం చేసి గోదావరి జలాలను ఆంధ్రాకు వదిలేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వర్షాలు పడకుండా హరీశ్‌రావు క్షుద్రపూజలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తూ.. ఇప్పుడు దేవునిపై భా రం వేస్తూ వరుణయాగం చేయడం ప్రభు త్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.