స్టార్టర్లు కాలిపోతున్నా పట్టించుకోరా?
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు, శారాజీపేట, కొల్లూరు, మదనపల్లి తదితర గ్రామాల్లో నెలకొన్న లోవోల్టేజీ సమస్యను పరిషరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులు శారాజీపేట సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
- పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన.. సబ్‌స్టేషన్ ముట్టడి
ఆలేరు రూరల్, ఆగస్టు 11: యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు, శారాజీపేట, కొల్లూరు, మదనపల్లి తదితర గ్రామాల్లో నెలకొన్న లోవోల్టేజీ సమస్యను పరిషరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులు శారాజీపేట సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం, లోవోల్టేజీ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లోవోల్టేజీ కారణంగా వ్యవసాయ బోరుబావుల స్టార్టర్లు తరచూ కాలిపోతున్నాయని చెప్పారు.
వాటి మరమ్మతులకు రైతులు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తున్నదని ఆవేదన చెందారు. విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో బోర్ల నుంచి నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతున్నదని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి లోవోల్టేజీ సమస్యకు శాశ్వత పరిషారం చూపాలని డిమాండ్ చేశారు. ఆలేరు ఏడీఈ వచ్చి లోవోల్టేజీ సమస్యను పరిషరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

