మానవాతీత శక్తుల పోరాటమే ‘అగధ’
శత్రువు, పోలీస్‌లాకప్, దేవి, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. నిర్మాతగా ఎమ్మెస్ రాజు అంటే ఏంటో చెప్పడానికి ఈ లైనప్ చాలు. ఆ అభిరుచితోనే దర్శకునిగా మారి ‘డర్టీ హరి’తో విజయకేతనం ఎగరవేశారు ఎమ్మెస్ రాజు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’.
శత్రువు, పోలీస్‌లాకప్, దేవి, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. నిర్మాతగా ఎమ్మెస్ రాజు అంటే ఏంటో చెప్పడానికి ఈ లైనప్ చాలు. ఆ అభిరుచితోనే దర్శకునిగా మారి ‘డర్టీ హరి’తో విజయకేతనం ఎగరవేశారు ఎమ్మెస్ రాజు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కాశీవిశాలాక్షి బసులు నిర్మాత. ఈ నెల 14న విడుదల కానున్నది. మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ఎమ్మెస్ రాజు ముచ్చటించారు. ‘అగధ’ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పొచ్చు. మనం దైవాన్ని, దెయ్యాన్ని కంటితో చూడలేం. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథే ‘అగధ’.
ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి నా గురించి ఓ మాట చెప్పారు. ‘నాకు తెలిసిన ఎమ్మెస్ రాజు కేవలం హారర్ ఎలిమెంట్స్‌తో మాత్రమే సినిమా తీయడు. ఇందులో చాలా అంశాలు ఉంటాయి’ అని ఆయన అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఇందులో అన్ని రకాల అంశాలూ ఉంటాయి. దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే ఓ దుష్టశక్తిని ‘అగధ’గా చూపించాను. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేసి, ఓ ఆర్ట్ ఫిల్మ్‌గా కాకుండా జనరంజకంగా రూపొందించా. ‘అగధ’ జర్నీలో ఏదో ఒక పవర్ ముందుండి నన్ను నడిపించినట్టు అనిపించింది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఏ స్థాయిలో ఉంటుందో టీజర్, ట్రైలర్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నా. ఈ కథకు సీక్వెల్, ప్రీక్వెల్ రెండింటికీ స్కోప్ ఉంది. రిలీజ్ తర్వాత వీటిలో ఏది ఉంటుందో చెబుతాను’ అని ఎమ్మెస్ రాజు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

