SI Manasa | రాయపోల్, డిసెంబర్ 01 : ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రాయపోల్ ఎస్ఐ మానస హెచ్చరించారు. సోమవారం ఎస్ఐ మానస సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతూర్ , అనాజీపూర్ తదితర గ్రామాలు పర్యటించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మానస మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు తెలియజేయునది ఏమనగా రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల నియమావళి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎవరు కూడా పర్మిషన్ లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. ఒకవేళ నిర్వహించాలి అనుకుంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకొని నిర్వహించుకోవాలి. లేని యెడల వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎలక్షన్ కోడ్‌ను ఎవరూ కూడా ఉల్లంఘించకూడదు. గ్రామాలలో ఎవరూ కూడా ఇల్లీగల్‌గా మద్యం అమ్మకాలు జరపకూడదు. ఎవరైనా ఇల్లీగల్‌గా మద్యం అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామంలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొన్ని గ్రామాల్లో జనావాసాలు ఉండే ప్రాంతంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని. వారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని లేని పక్షంలో కేసులు తప్పవు అని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిచే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
Padipuja | అయ్యప్ప స్వామి పడిపూజలో మాజీ ఎమ్మెల్యే
Local Election | విద్యుత్ నో డ్యూ సర్టిఫికెట్ కోసం ఎన్నికల అభ్యర్థుల తిప్పలు
Bomb Threat | కేరళ సీఎంకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు