కొల్లాపూర్ : నియోజకవర్గంలోని కల్వకోల్ గ్రామంలో రాజు దేశ్ పాండే గురు స్వామి సోమవారం అయ్యప్ప స్వామి పడిపూజ (Padi Puja) నిర్వహించారు. గురుస్వామి ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ( Biram Harsavardan Reddy 0 పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొల్లాపూర్ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో, పాడిపంటలతో ఉండాలని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నానని తెలిపారు.పడిపూజ సందర్భంగా భక్తిపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు .