Suspension | బూర్గంపహాడ్, మార్చి 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (గణితం) ఎం.నాగేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మీ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈవో యధుసింహరాజు ఓ ప్రకటనలో తెలిపారు.
నాగేశ్వరరావు క్రిమినల్ కేసులో అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని ఎంఈవో వివరించారు. అందుకే సీసీఏ నిబంధనల ప్రకారం నాగేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు తెలిపారు.