Oscar Awards 2026 | ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ విజయం.., ఉత్తమ నటి జెస్సీ బుక్లే.. బెస్ట్ మూవీ ఏంటంటే
Oscar Awards 2026 | హాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ఈసారి కూడా అట్టహాసంగా ప్రారంభమైంది. 98వ ఎడిషన్‌కు సంబంధించిన ఈ కార్యక్రమం అమెరికా కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్లో జరిగింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.30 గంటలకు అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది.
Oscar Awards 2026 | హాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ఈసారి కూడా అట్టహాసంగా ప్రారంభమైంది. 98వ ఎడిషన్‌కు సంబంధించిన ఈ కార్యక్రమం అమెరికా కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్లో జరిగింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.30 గంటలకు అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. ప్రపంచ సినీ పరిశ్రమ దృష్టి మొత్తం ఈ వేడుకపై నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అమెరికన్ కమేడియన్, రచయిత మరియు టెలివిజన్ హోస్ట్ కానన్ ఓబ్రియాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తన ప్రత్యేకమైన హాస్యశైలితో ప్రేక్షకులను అలరించారు. ఆస్కార్ వేడుకకు వ్యాఖ్యాతగా కానన్ ఓబ్రియాన్ వ్యవహరించడం వరుసగా రెండోసారి కావడం విశేషం.
ఈ వేడుకలో భారతీయ మూలాలు కలిగిన హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అంతేకాదు, ఈ ఏడాది కొన్ని అవార్డులను ప్రకటించే ప్రెజెంటర్లలో కూడా ఆమె ఉండటం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల రేసులో ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన “సిన్నర్స్” చిత్రం అత్యధికంగా 16 నామినేషన్లు దక్కించుకుని రికార్డు సృష్టించింది. మరోవైపు పాల్ థామస్ అండర్సన్ తెరకెక్కించిన “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్” చిత్రం 13 నామినేషన్లతో గట్టి పోటీ ఇచ్చింది. అవార్డుల సీజన్లో ఈ రెండు సినిమాలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇక ఉత్తమ నటుడి కేటగిరీలో స్టార్ హీరో మైఖేల్ బీ జోర్డాన్ విజయం సాధించారు. “సిన్నర్స్” చిత్రంలో ఆయన చేసిన అద్భుత నటనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. మిస్సిసిప్పి నేపథ్యంగా తెరకెక్కిన ఈ సూపర్ నేచురల్ చిత్రంలో జోర్డాన్ స్మోక్, స్టాక్ అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.ఈ అవార్డుతో ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్న ఆరో నల్లజాతి నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ నిలిచారు. గతంలో సిడ్నీ పోయిటియర్, డెంజెల్ వాషింగ్టన్, జామీ ఫాక్స్, ఫారెస్ట్ విటేకర్, విల్ స్మిత్ వంటి ప్రముఖ నటులు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ఉత్తమ నటిగా జెస్సీ బుక్లే కి హమ్నెట్ చిత్రానికి గాను అవార్డ్ దక్కింది. ఇక వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకిగానూ పాల్ థామస్ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ని సొంతం చేస్తున్నారు. అంతేకాదు ఇదే మూవీ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది.
98వ అకాడమీ అవార్డుల పూర్తి జాబితా
ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ నటుడు: మైఖేల్ బి జోర్డన్ (సిన్సర్స్)
ఉత్తమ నటి: జెస్సీ బుక్లే (హమ్నెట్)
ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్(వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటుడు: ఈన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్(వెపన్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్ డురాల్డ్ అర్కపా(సిన్నర్స్)
ఉత్తమ ఎడిటింగ్: యాండీ జుర్గెన్ సన్(వన్ బ్యాటిల్ అఫ్టర్ అనదర్ )
ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్(సిన్నర్స్)
ఉత్తమ సౌండ్ : ఎఫ్ 1
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: అవతార్ ఫైర్ అండ్ యాష్
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : గోల్డెన్ ఫ్రమ్ కేపాప్ డీమాన్ హంటర్స్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: పాల్ థామస్ అండర్సన్(వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ క్యాస్టింగ్ : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకిన్ స్టన్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్: ఫ్రాంకిన్ స్టన్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తమర డేవెరల్, షేన్ వ్యూ(ఫ్రాంకిన్ స్టన్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వ్యాల్యూ(నార్వే)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కెపాస్ డెమన్ హంట్స్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్జేంచ్ సలైవా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్ నోబడీ ఎగనెస్ట్ పుతిన్
ఉత్తమ డాక్యుమెంటరీ ఆర్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
NHRC | తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల దుస్థితిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
Vishwambhara | ఎట్టకేలకు ఊపందుకున్న మెగాస్టార్ ‘విశ్వంభర’.. ట్రైలర్ రెడీ, రిలీజ్ డేట్ ఎప్పుడో?
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

