Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు బెదిరింపులు వచ్చాయి. సీఎం అధికారిక నివాసంతోపాటూ పాలయంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు, సీఎం వ్యక్తిగత కార్యదర్శికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. సీఎం నివాసంతోపాటూ, మిగతా రెండు చోట్లా బాంబులు పెట్టినట్లు ఆగంతకులు మెయిల్ పంపించారు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు సోదాలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో రెండు చోట్లా తనిఖీలు చేశారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బెదిరింపు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Samantha-Raj | రూమర్సే నిజమయ్యాయి.. వివాహ బంధంతో ఒక్కటైన సమంత-రాజ్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన
Delhi Blast | ఢిల్లీ పేలుడు కేసు.. జమ్ము కశ్మీర్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
PM Modi | పరాజయాన్ని ఒప్పుకొనే మనసు విపక్షానికి లేదు : ప్రధాని మోదీ