Samantha-Raj | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గత కొన్ని రోజులుగా నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. అందుకు కారణం రెండో పెళ్లే. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమోరు (Raj Nidimoru)తో సమంత డేటింగ్లో ఉన్నారంటూ గత కొంత కాలంగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ రూమర్సే నిజమయ్యాయి. సామ్-రాజ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్ (Isha Yoga Centre)లో గల లింగ భైరవి ఆలయం (Ling Bhairavi Temple)లో వీరి వివాహం జరిగింది. దక్షిణాది సంప్రదాయం ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు. ఎరుపు రంగు కంచిపట్టు చీరలో సమంత ఎంతో అందంగా రెడీ అయ్యారు. ఇవాళ ఉదయం నిశ్చితార్థం, ఆ వెంటనే పెళ్లి కూడా జరిగిపోయింది. ఈ వేడుకకు దగ్గరి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ శుభవార్తను సమంత ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు పెళ్లి ఫొటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, అభిమానులు సామ్-రాజ్ జంటకు శుభకాంక్షలు చెబుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read..
Tamannah | తమన్నా చేతికి మరో బిగ్ ఆఫర్… ఆ బయోపిక్‌లో కీలక పాత్ర!
Ashika Ranganath | టాలీవుడ్ నటి ఆషికా రంగనాథ్ ఇంట్లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న మేనమామ కూతురు
Shivaji Raja | అరుణాచలంలో సెల్ఫీలు, వ్లాగ్‌లు.. వాళ్లే అంతా నాశనం చేస్తున్నారంటూ శివాజీ రాజా ఫైర్