PM Modi | ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాజయాన్ని కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని దుయ్యబట్టారు. ఓటమి బాధ నుంచి బయటకు రావాలంటూ ప్రతిపక్ష కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సూచించారు. నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకు ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మాట్లాడారు. ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
‘సమావేశాలు సజావుగా ముందుకు సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలి. సభా సమయాల్లో డ్రామాలు వద్దు. చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పనిసరి. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో మంచి చర్చలు కొనసాగాలి. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. పరాజయం కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదు. మేము మాత్రం విపక్షాలను కలుపుకొని ముందుకెళ్తాం. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా మాతో కలిసి రావాలి. అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాను. దేశ ప్రగతి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలి. కొత్త ఎంపీలకు స్ఫూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలి’ అని ప్రధాని పేర్కొన్నారు.
Also Read..
Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
Pinarayi Vijayan | రూ.2వేల కోట్ల మసాలా బాండ్ కేసు.. కేరళ సీఎంకు ఈడీ నోటీసులు
WhatsApp Status | భార్యను చంపి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు..